కవిటి: జాతీయస్థాయిలో సత్తా.. సత్కారించిన మహారాష్ట్ర సీఎం

1248చూసినవారు
ముంబయిలోని బాంబే ఐఐటీలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్-2025 పోటీలో కవిటి మండలం ఆర్.బెలగాంకు చెందిన సుమిత్ సత్తా ప్రథమ స్థానం సాధించాడు. ఎన్పీసీఐ ఆధ్వర్యంలో యూపీఐ, రూపే పేమెంట్ సిస్టమ్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ పోటీలో బ్యాంక్ ట్రాన్సాక్షన్, పేమెంట్స్ డేటాపై సమస్యను పరిష్కరించడంలో సుమిత్ ప్రతిభ కనబరిచాడు. అతన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ రూ.5 లక్షల నగదు, జ్ఞాపికతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్