సోంపేట పట్టణంలోని చలపతి గొర్జివీధిలో సోమవారం రాత్రి ఒక పెంకుటింట్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో, వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఎలా సంభవించిందో ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.