పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన ఎన్ని వీరన్న, ఈ నెల 8వ తేదీన ఎచ్చెర్ల వెళ్తానని చెప్పి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. మొదట కుమార్తె ఇంటికి వెళ్లి ఉంటారని భావించిన భార్య వరలక్ష్మి, ఆమెతో మాట్లాడగా వీరన్న అక్కడికి రాలేదని తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై జి రంజిత్ తెలిపారు. సమాచారం అందించిన వారికి 10,000 రూపాయల బహుమతి ప్రకటించారు.