అంతర పాఠశాల గ్రిగ్గ్స్ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కూన రవి కుమార్

501చూసినవారు
అమడాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం 69వ అంతర పాఠశాల బాల బాలికల గ్రిగ్గ్స్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసం పెరగడమే కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా రంగాల్లో రాణించే అవకాశాలు ఉంటాయని తెలిపారు.