ఎచ్చెర్ల మండలంలోని ముద్దాడ జడ్పీ హైస్కూల్ విద్యార్థిని ఎం.శుభశ్రీ ఐఐఐటీ శ్రీకాకుళం క్యాంపస్‌లో సీటు సాధించింది. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుడు డి.రామ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కృషి, పట్టుదలతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవచ్చని ఆయన అన్నారు. శుభశ్రీ విజయం పాఠశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు శుభశ్రీని అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.