లక్కివలస పంచాయతీ గెద్దలపాడు గ్రామానికి చెందిన జియాలజిస్ట్ చింతల సంతోష్ (26) కుటుంబానికి అండగా ఉంటూ, విదేశాలకు వెళ్లి స్థిరపడాలని కలలు కన్నాడు. బుధవారం రాత్రి ఇంటికి బయలుదేరిన అతను, నాగ్పూర్ సమీపంలో రైలులో ప్రయాణిస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. అతని ఫోన్ నంబర్ల ఆధారంగా రైల్వే సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.