కేజీబీవీని సందర్శించిన సెక్రటరీ, విద్యార్థులతో ముచ్చట

170చూసినవారు
కేజీబీవీని సందర్శించిన సెక్రటరీ, విద్యార్థులతో ముచ్చట
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు (మురపాక) కేజీబీవీని మంగళవారం సెక్రటరీ డి. దేవానంద్ రెడ్డి సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి, విద్యా విషయాలపై పరీక్షించారు. క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించాలని, ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. పాఠశాల రికార్డులను పరిశీలించి, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్