సోంపేట సర్కిల్ పరిధిలో ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దులలో బెల్లం ఊటలను ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ శాఖ సిఐ జి వి రమణ తెలిపారు. శనివారం ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరిండెండెంట్ రామచందర్రావు, ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ మురళీధర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడులలో భాగంగా గంజాం జిల్లా పరిసర ప్రాంతాలలో రెండు చోట్ల సుమారు పదివేల లీటర్ల బెల్లం ఓటర్లను ధ్వంసం చేశారు. ఈ దాడులలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.