శ్రీకాకుళం: సత్తా చాటిన బాక్సింగ్ క్రీడాకారులు

1437చూసినవారు
శ్రీకాకుళం: సత్తా చాటిన బాక్సింగ్ క్రీడాకారులు
విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 12 పతకాలు సాధించారు. వీరిలో మూడు బంగారు, ఏడు రజత, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి. జిల్లా క్రీడాకారులను డీఎస్ఈవో ఎ. మహేష్బాబు అభినందించారు. వీరిని తీర్చిదిద్దుతున్న కోచ్ ఉమామహేశ్వరరావును ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్