కవిటి మండలం బొరివంకలో శనివారం అర్ధరాత్రి ఒక పుస్తకాల దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణం యజమాని మనోజ్ తెలిపిన వివరాల ప్రకారం, దొంగలు రూ.40 వేల విలువైన డ్రోన్ కెమెరా, సుమారు రూ.20 వేల నగదు దోచుకెళ్లారు. డెలివరీ కోసం దుకాణంలో ఉంచిన ఇతర విలువైన వస్తువులను కూడా దొంగలు అపహరించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మనోజ్ పేర్కొన్నారు.