Feb 11, 2026, 14:02 IST/
ప్రియుడి బెదిరింపులు తట్టుకోలేక విషం తాగి వధువు ఆత్మహత్య
Feb 11, 2026, 14:02 IST
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి రోజునే నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఆరు సంవత్సరాలుగా ప్రియుడితో సంబంధంలో ఉన్న యువతి, కుటుంబం కోసం పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధపడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు, ఆమె కాబోయే భర్తకు వారి ప్రేమ విషయం చెప్పి వేధించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి, మానసిక ఒత్తిడితో ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.