Mar 16, 2026, 14:03 IST/
ప్రత్యూష మృతి కేసు.. కోర్టులో లొంగిపోయిన సిద్ధార్థరెడ్డి
Mar 16, 2026, 14:03 IST
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సినీనటి ప్రత్యూష మృతి కేసులో దోషిగా తేలిన సిద్ధార్థరెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అమెరికా నుంచి వచ్చిన సిద్ధార్థరెడ్డి న్యాయస్థానంలో లొంగిపోవడంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2002 ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటనలో, ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకొని తాగారు. చికిత్స పొందుతూ ప్రత్యూష మృతి చెందగా, సిద్ధార్థరెడ్డి కోలుకున్నాడు. ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించాడని ట్రయల్ కోర్టు గతంలో తీర్పునిచ్చింది.