Mar 16, 2026, 08:03 IST/
మెడికల్ కాలేజీలో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది సజీవదహనం(వీడియో)
Mar 16, 2026, 08:03 IST
ఒడిశా కటక్‌లోని SCB మెడికల్ కాలేజీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ట్రామా కెర్ సెంటర్ ICUలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఘటనాస్థలాన్ని ఒడిశా సీఎం మోహన్ చరణ్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.