Mar 13, 2026, 11:03 IST/కరీంనగర్
కరీంనగర్
గంగాధర: రెండు బైకులు ఢీ.. ఇరువురికి గాయాలు
Mar 13, 2026, 11:03 IST
గంగాధర మండల కేంద్రంలో శుక్రవారం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం లేదా అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మండల కేంద్రం నుంచి మధురానగర్ వైపు వెళ్తున్న ఒక బైక్, మధురానగర్ నుంచి మండల కేంద్రం వైపు వస్తున్న మరో బైక్‌తో వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిపోయిన క్షతగాత్రులకు శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, వారిని ఆసుపత్రికి తరలించారు.