శనివారం రాత్రి నరసన్నపేటలో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో పోలాకి మండలం గాతలవలస వాసి అయిన బమ్మిడి దామోదరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 సిబ్బంది స్పందించి, క్షతగాత్రుడిని నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.