నరసన్నపేటలో ఎరువుల దుకాణాలు బంద్

4చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలు సోమవారం బంద్ పాటించాయి. రాష్ట్ర ఎరువుల సంఘ పిలుపు మేరకు ఈ బంద్ నిర్వహించినట్లు దుకాణాల సంఘ అధ్యక్షులు కళ్యాణ్ కుమార్, కార్యదర్శి కామేశ్వరరావు తెలిపారు. ఎరువుల కంపెనీలు ఇతర సరుకులను ముడిపెట్టడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఒకరోజు పాటు బంద్ నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్