జలుమూరు మండల కేంద్రంలోని ప్రైమరీ మోడల్ పాఠశాలలో నలుగురు విద్యార్థులు చేరారని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. బుధవారం స్థానిక పాఠశాల పరిధిలో తహసిల్దార్ జె రామారావు, డిప్యూటీ ఎంపీడీవో ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో అడ్మిషన్లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న నలుగురు విద్యార్థులను వారి తల్లిదండ్రులను కలిసి పాఠశాలలో చేర్పించారు.