జలుమూరు ఆదర్శ మోడల్ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థులకు కళ్ళజోళ్లను అందజేశారు. ఇటీవల వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేత్ర పరీక్షల్లో కొందరు విద్యార్థులకు దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పాఠశాలకు అందిన కళ్ళజోళ్లను విద్యార్థులకు పంపిణీ చేసినట్లు హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావు తెలిపారు. దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు కళ్ళజోళ్లు అందించడం ద్వారా వారి చదువుకు తోడ్పాటు అందిస్తున్నారు.