జలుమూరు మండలం సురవరం గ్రామానికి చెందిన పిట్ట దుర్గమ్మ (71) శుక్రవారం ఉదయం మానసిక వేదనతో పేలు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను నరసన్నపేట ఏరియా హాస్పిటల్కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై బి. అశోక్ బాబు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.