గురువారం జలుమూరు మండలం టెక్కలిపాడులో ఉపాధి వేతనదారులకు శక్తి యాప్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు గిరిధర్, భీమారావు, మహిళా పోలీస్ విజయలక్ష్మి మాట్లాడుతూ, నేడు ప్రతి ఒక్కరూ సెల్ఫోన్లను వాడుతున్నారని, కాబట్టి తప్పనిసరిగా శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాహనాలలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు.