జలుమూరు మండల కేంద్రంలోని ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులను ఆదివారం విద్యావైజ్ఞానిక విహార యాత్రకు తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడు మెండ రామారావు ఆధ్వర్యంలో స్థానిక పాఠశాల విద్యార్థులు బారువ సముద్ర తీర ప్రాంతాల్లో విహారయాత్ర నిర్వహించారు. అక్కడ ఉన్న లైట్ హౌస్ తో పాటు పలు విశేషాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.