జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో వైశాఖమాసం బహుళ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని సోమవారం భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పల్లకిలో శివపార్వతులను అలంకరించి గ్రామోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆలయ ఈవో కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఏకాదశి పర్వదినాన స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం తమ సాంప్రదాయమని తెలిపారు.