గురువారం సాయంత్రం జలుమూరు పీహెచ్‌సీలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి వైద్య సిబ్బందితో మాట్లాడుతూ, వైద్య సేవలు రోగులకు సంతృప్తినిచ్చేలా కృషి చేయాలని సూచించారు. పీహెచ్‌సీలో ఏవైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని, మందుల కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎంపీపీ వాన గోపి, అర్చన బగ్గు, వైద్యాధికారులు పాల్గొన్నారు.