ఖరీఫ్ సీజన్ నుండి రబీ సీజన్ కు మారినప్పటికీ యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను శ్రీముఖలింగం ఎంపీటీసీ కె. ప్రసాద్, గుగ్గిలి సర్పంచ్ ఆదివారం జలుమూరు మండల పరిషత్ సమావేశంలో ప్రస్తావించారు. ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలవాలని వారు కోరారు.