జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీ రాధా గోవిందస్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గురువారం మాట్లాడుతూ, ప్రతి ఏడాది భీష్మ ఏకాదశి రోజున స్వామివారికి పూజల అనంతరం 24 గంటల పాటు ఏకాహం భజన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల నుండి 12 భజన బృందాలు పాల్గొంటాయని పేర్కొన్నారు.