గురువారం జలుమూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు వైద్య అధికారి జి. సుజాత ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యులు సూచించిన మందులను సకాలంలో వాడాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె గర్భిణీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో 27 మంది గర్భిణీలకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు అందజేశారు.