జలుమూరు మోడల్ ఆదర్శ పాఠశాలను ఎంఈఓ బమ్మిడి మాధవరావు శనివారం సందర్శించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జనరల్ నాలెడ్జిపై ప్రత్యేకంగా దృష్టి సారించి బోధన అందజేయాలని ఆయన తెలిపారు. దేశాలు, వాటి రాజధానులు, నదులు, పర్వతాలు వంటి అంశాలపై ప్రాథమిక స్థాయి నుంచే అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచనలు చేశారు. మౌలిక వసతులతో పాటు మధ్యాహ్న భోజనం సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.