జలుమూరు: పల్స్ పోలియో చుక్కలతో అంగవైకల్యం దూరం.. ఎంపీడీవో

796చూసినవారు
జలుమూరు: పల్స్ పోలియో చుక్కలతో అంగవైకల్యం దూరం.. ఎంపీడీవో
ఆదివారం జలుమూరు మండలం చల్లవానిపేట వద్ద పిహెచ్సి వైద్యులు సుజాత, అహల్య ఆధ్వర్యంలో చేపట్టిన పల్స్ పోలియో శిబిరాన్ని ఎంపీడీవో చిన్నమ్మడు ప్రారంభించారు. చిన్నారులకు పోలియో చుక్కలు ఇవ్వడం వలన భవిష్యత్తులో అంగవైకల్యానికి దూరంగా ఉంచవచ్చని ఆమె తెలిపారు. పోలియో చుక్కలు అందుబాటులో లేని వారికి రేపు కూడా మాస్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్