కోటబొమ్మాలి మండలం జలుమూరు దరి తిలారు రైల్వేస్టేషన్లో బరంపురం విశాఖపట్నం (18525/18526) రైల్వే ఎక్స్ప్రెస్ సర్వీస్కు హాల్ట్ మంజూరు చేస్తూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రిని కలిసిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. దీంతోపాటుగా పలు రైలు సర్వీస్ లను జిల్లాలో హాల్ట్ కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.