జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ బోర్డు చైర్మన్ శివప్రసాద్ పాడి తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో పాలకమండలి సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 15, 16, 17 తేదీలలో నిర్వహించే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.