జలుమూరు: త్రాగునీటి కోసం రహదారులు, కాలువలు ధ్వంసం

0చూసినవారు
జలుమూరు మండలం హుస్సేన్ పురం లో ఇటీవల మంజూరైన జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా త్రాగునీటి పైపులు వేసేందుకు రహదారులను ధ్వంసం చేశారని, మురుగు కాలువలను తొలగించడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, దీనిపై దృష్టి సారించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్