శుక్రవారం జలుమూరు మండల ఆదర్శ మోడల్ స్కూల్లో భారతరత్న, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాధవరావు, ఉపాధ్యాయుడు మెండ రామారావు మాట్లాడుతూ, స్వాతంత్ర్య పోరాటంలోనూ, పరిపాలనలోనూ అందరినీ ఐక్యం చేసిన ఘనత సర్దార్ పటేల్‌కే దక్కుతుందని కొనియాడారు. నేటి తరం విద్యార్థులు ఆయన గురించి తెలుసుకోవడం ఎంతో మంచిదని సూచించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.