జలుమూరు మండల స్థాయిలో నిర్వహించిన చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు మంగళవారం విజయవంతంగా ముగిశాయి. ఈ పరీక్షలలో మొత్తం 69 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల నుండి 18 టీంలు, ప్రైవేట్ పాఠశాలల నుండి నాలుగు టీంలు పాల్గొన్నాయి. ఎలమంచిలి విద్యార్థి ప్రధమ బహుమతి సాధించాడని ఎంఈఓ బమ్మిడి మాధవరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.