జలుమూరు మండలం బసివాడ ప్రభుత్వ మోడల్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు హెచ్.ఎమ్ బి. శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ, రెండవ రోజు కూడా అంతరాయం లేకుండా తరగతులు కొనసాగాయని, నూతనంగా ఎనిమిది మంది విద్యార్థులు చేరారని వివరించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్సు పుస్తకాలు కూడా పంపిణీ చేసినట్లు తెలిపారు.