జలుమూరు మండలం ఊడికల పేట గ్రామంలో సోమవారం ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. పర్లాం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం శాంతి, రామకృష్ణాపురం జడ్పీ పాఠశాల హెచ్ఎం ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామస్తుల నుండి మంచి స్పందన వస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు.