మంగళవారం ఉదయం శ్రీముఖలింగం లోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయాన్ని మూసివేశారు. గ్రహణ శూల కారణంగా ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించినట్లు కార్య నిర్వహణ అధికారి కె ఏడుకొండలు తెలిపారు. గ్రహణం అనంతరం ఆలయాన్ని తెరిచి, సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత బుధవారం ఉదయం నుండి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.