ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా మధ్యాహ్న భోజన పథకంలో స్వీట్ పొంగలిని ఏర్పాటు చేసినట్లు ఎంఈఓలు ఎంవీఎస్ ప్రసాదరావు, బమ్మిడి మాధవరావు తెలిపారు. శుక్రవారం జలుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ప్రతి పాఠశాలలో స్వీట్ పొంగలి ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
విద్యార్థులు ఈ ఏర్పాటును ఆనందించారని వారు పేర్కొన్నారు.