జలుమూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎంఈఓ బమ్మిడి మాధవరావు బుధవారం ఉదయం గోలియా పుట్టి గ్రామంలో తల్లిదండ్రులను కలిసి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. తల్లిదండ్రుల నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆయన తెలిపారు.