జలుమూరు మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-1990 సంవత్సరాల మధ్య ఆరవ తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు ఆదివారం అదే పాఠశాలలో కలుసుకున్నారు. 35 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ ఆత్మీయ కలయికలో, వారు ఒకరికొకరు క్షేమ సమాచారాలను తెలుసుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా, తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు ఆనందాన్ని పంచుకున్నారు.