నరసన్నపేట ఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ గా కృష్ణమూర్తి ఎన్నిక

2చూసినవారు
నరసన్నపేట ఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ గా కృష్ణమూర్తి ఎన్నిక
నరసన్నపేట నియోజకవర్గం ఎన్జీవో సంఘం వైస్ ప్రెసిడెంట్ గా ఏరియా హాస్పిటల్ రేడియోగ్రాఫర్ కె.వి.వి. కృష్ణమూర్తి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నరసన్నపేట సబ్ ట్రెజరీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బి. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపికను ప్రకటించారు. కృష్ణమూర్తి తన పదవీకాలంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని తెలిపారు. విశ్రాంత ఏవో ఏపీ రమణమూర్తితో పాటు పలువురు ఆయనను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్