నరసన్నపేట మండలం లుకులాం ఉన్నత పాఠశాల ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగింది. కేవలం వర్షం నీరే కాకుండా గ్రామంలోని కాలవల ద్వారా, స్కూల్కు ఆనుకుని వున్న వాటర్ ట్యాంక్ లీక్ అయ్యి కొంతమేర నీరు పాఠశాలలో చేరడంతో పాఠశాల పరిసరాలు చెరువుని తలపిస్తున్నాయి. విద్యార్థులు స్కూలుకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. నీటిని తొలగించే చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.