నరసన్నపేట: చెట్టు వాలింది.. ప్రమాదం పొంచి ఉంది

2చూసినవారు
నరసన్నపేట మండల కేంద్రంలోని గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు వేళ్ళతో సహా మరో చెట్టుపై వాలిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ కార్యాలయాలకు ప్రజలు నిత్యం వస్తూ పోతూ ఉంటారు. ఈ నేపథ్యంలో, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయం వారిలో నెలకొంది. చెట్టు కూలితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్