నరసన్నపేట సాంఘిక సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారిగా పనిచేస్తున్న టి సూర్యప్రభకు ఇటీవల ఏఎస్ డబ్ల్యుఓ గా పదోన్నతి కల్పిస్తూ పాలకొండకు బదిలీ చేశారు. ఆమె మొన్న శనివారం బాధ్యతలు స్వీకరించారు. సోమవారం నరసన్నపేటలో మాట్లాడుతూ, మంగళవారం తాను పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ డబ్ల్యుఓ గా కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేయనున్నట్లు ఆమె తెలియజేశారు.