నరసన్నపేట: మాతృమూర్తి పేరిట నిరుపేదలకు అంబులెన్స్ వితరణ

6చూసినవారు
నరసన్నపేట పట్టణ కలింగ వైశ్య సంఘ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ ప్రతినిధి వెంకటేశ్వరరావు, తన మాతృమూర్తి లలితాంబ జ్ఞాపకార్థం నిరుపేదల కోసం ఉచిత అంబులెన్స్ సేవలను ప్రారంభించారు. బుధవారం నరసన్నపేటలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, అత్యవసర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవడమే ఈ సేవల ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.