నరసన్నపేట: ఉత్తమ ఎంఈఓ శాంతరావుకు ఘనసత్కారం

1చూసినవారు
నరసన్నపేట ఎంఈఓ ఉప్పాడ శాంతారావు జిల్లా ఉత్తమ ఎంఈఓగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం నరసన్నపేట ఎంపీడీవో కార్యాలయంలో యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్ మూర్తి, పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాంతారావుతో పాటు సిఆర్పీ లక్ష్మణరావును ఘనంగా సన్మానించారు. ఈ పురస్కారం నరసన్నపేట మండలానికి దక్కడం ఆనందదాయకమని వారు పేర్కొన్నారు. ఎంఈఓ 2 పేడాడ దాలినాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్