నరసన్నపేట: బొరిగివలస పంచాయతీ కార్యదర్శి ప్రవీణాకు పురస్కారం

3చూసినవారు
నరసన్నపేట: బొరిగివలస పంచాయతీ కార్యదర్శి ప్రవీణాకు పురస్కారం
నరసన్నపేట మండలం బొరిగివలస సచివాలయంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న కే. ప్రవీణ ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నారు. శ్రీకాకుళంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ ఎం. కృష్ణ తేజ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును స్వీకరించారు. ఇటీవల కాలంలో ఐ.వి.ఆర్.ఎస్ కాల్స్ పరిష్కారంలో, పారిశుద్ధ్య నిర్వహణలో ఆమె చేసిన కృషికి గాను ఈ పురస్కారం లభించిందని ప్రవీణ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you