నరసన్నపేట: శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయండి.. డి ఎల్ పి ఓ

1చూసినవారు
నరసన్నపేట: శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయండి.. డి ఎల్ పి ఓ
శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారి గోపి బాల, పంచాయతీలలో ఇంటి పన్నులతో పాటు దుకాణాల పన్నులను కూడా శత శాతం వసూలు చేయాలని ఆదేశించారు. గురువారం నరసన్నపేట పంచాయతీ కార్యాలయంలో మండల కార్యదర్శులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు. వచ్చే నెల ఫిబ్రవరి 15వ తేదీలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని, లక్ష్యం పూర్తి చేయని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్