నరసన్నపేట: మధ్యాహ్న భోజన పథకానికి వంట గ్యాస్ అందజేత

1చూసినవారు
నరసన్నపేట: మధ్యాహ్న భోజన పథకానికి వంట గ్యాస్ అందజేత
నరసన్నపేట మండలం పారసెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందించడానికి వంటగ్యాస్ కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని హెచ్ఎం బొడ్డు తవుడు తెలిపారు. సమాచారం అందుకున్న రైల్వే విశ్రాంత ఉద్యోగి వెలమల భాస్కరరావు బుధవారం పాఠశాలకు వచ్చి వంటగ్యాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, వంట ఏజెన్సీ సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు. పాఠశాలలకు వంటగ్యాస్ సమస్య నెలకొందని హెచ్ఎం పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్