నరసన్నపేట మండల కేంద్రంలోని శ్రీరామ గీత మందిరంలో ధనుర్మాసం సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు పీసపాటి సూరిబాబు 19వ పాశురం పఠించి, దీపోత్సవం నిర్వహించారు. ధనుర్మాసం నెలరోజులపాటు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆయన తెలిపారు.