ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామీణ రహదారుల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. సోమవారం ఉదయం నరసన్నపేట మండలంలోని దేవాది, మబగాం మీదుగా కిళ్లాం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టామని, దీనికి ఉపాధి హామీ నిధుల ద్వారా కోటి రూపాయలు మంజూరు చేశామని వివరించారు. రహదారి నిర్మాణం వేగవంతం కావడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కోఆర్డినేటర్ బగ్గు అర్చన, నాయకులు పాల్గొన్నారు.